మాజీ ఎంపీ నివాసంలో ముగిసిన సీబీఐ సోదాలు.. అప్రమత్తమవుతున్న పలువురు రాజకీయ నేతలు..

|

Dec 19, 2020 | 5:39 AM

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు ముగిసాయి. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ రుణం

మాజీ ఎంపీ నివాసంలో ముగిసిన సీబీఐ సోదాలు.. అప్రమత్తమవుతున్న పలువురు రాజకీయ నేతలు..
Follow us on

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు ముగిసాయి. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ రుణం ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు ఏడు గంటల పాటు ఈ సోదాలు నిర్వహించారు. రాయపాటి కుటుంబ సభ్యులను కూడా విచారించారు. బెంగుళూరు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం ఈ తనిఖీలు నిర్వహించింది.

ట్రాన్స్‌ట్రాయ్‌తో రాయపాటికి ఉన్న సంబంధంపై అధికారులు ఆరా తీశారు. రాయపాటికి చెందిన గుంటూరు, హైదరాబాద్‌లోని నివాసాల్లో సోదాలు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి సంబంధించిన డ్యాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం రాయపాటి వాంగ్మూలం నమోదు చేసుకొని బ్యాంక్ పత్రాలను, పలు నోటీసులను వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ ఇంట్లో సీబీఐ తనిఖీలు ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. సీబీఐ తమపై ఎప్పడు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పలువురు రాజకీయ నేతలు అప్రమత్తమవుతున్నారు.