కూతురి పెళ్లికి దాచిన డబ్బు..అగ్గి మింగేసింది

విధి మనుషులతో ఆటలాడుతోంది. పేదవారితో మరింత కర్కశంగా వ్యవహరిస్తుంది. అటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అప్పు తీసుకొచ్చి కూతురు పెళ్లి కోసం దాచుకున్న సోమ్ము అగ్ని ప్రమాదంలో తగలిబడిపోయింది. తమ గారాల పట్టికి చేయించుకున్న బంగారం మంటల వేడికి కరిగిపోయింది. పూరింట్లో గుట్టుగా బ్రతుకుతున్న ఓ పేద కుటుంబంలో అగ్ని ప్రమాదం చీకట్లు నింపింది.  దర్శి మండలం అనపర్తివారి పాలెంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్దమైంది. అనపర్తివారిపాలెం నివాసులైన అనపర్తి బాలకోటయ్య, […]

కూతురి పెళ్లికి దాచిన డబ్బు..అగ్గి మింగేసింది
Fire Accident

Updated on: Aug 16, 2019 | 2:50 PM

విధి మనుషులతో ఆటలాడుతోంది. పేదవారితో మరింత కర్కశంగా వ్యవహరిస్తుంది. అటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అప్పు తీసుకొచ్చి కూతురు పెళ్లి కోసం దాచుకున్న సోమ్ము అగ్ని ప్రమాదంలో తగలిబడిపోయింది. తమ గారాల పట్టికి చేయించుకున్న బంగారం మంటల వేడికి కరిగిపోయింది. పూరింట్లో గుట్టుగా బ్రతుకుతున్న ఓ పేద కుటుంబంలో అగ్ని ప్రమాదం చీకట్లు నింపింది.  దర్శి మండలం అనపర్తివారి పాలెంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్దమైంది.

అనపర్తివారిపాలెం నివాసులైన అనపర్తి బాలకోటయ్య, కృపమ్మలు దంపతులు. ఈ రోజు ఉదయం వారిద్దరూ గేదెల మేత కోసం పొలం వెళ్లారు. వీరి కూతురు ఇందిరమ్మ ఇంట్లో కట్టెల పొయ్యి మీద రోజూ లానే వంట ప్రారంభించింది. కొంతసేపటి తరువాత పొయ్యి నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడగా.. ఇందిరమ్మ భయపడి బయటకు పరిగెత్తింది. ఇరుగుపొరుగు వారిని పిలిచేలోపే మంటలు ఇంటిని అంటుకొని పైకి ఎగిశాయి. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.  ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. ఆలోపే నష్టం జరిగిపోయింది.  తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసమని నాలుగు లక్షలు అప్పుతెచ్చి కొంత బంగారం చేయించారు ఆ దంపతులు. మిగిలిన నగదు ఇంట్లో దాచి ఉంచారు. అగ్నిప్రమాదం వల్ల ఇంట్లో ఉన్న బంగారం మంటల వేడికి కరిగిపోగా, నగదు కాలిపోయింది. కోటయ్య కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఎవరైనా తమనకు సాయం చెయ్యాలని వేడుకుంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us