లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..! కారుతో కేటుగాళ్లు కాచుక్కుని కూర్చున్నారు..!

| Edited By: Balaraju Goud

Aug 06, 2024 | 5:22 PM

అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే.. అర్ధరాత్రి సమయం. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. నిద్ర మత్తు వచ్చిన లారీ డ్రైవర్లు తమ వాహనాలను సమీపంలోని పెట్రోల్ బంక్ ల వద్ద నిలిపి అద మరిచి నిద్రపోతున్నారు.

లారీ డ్రైవర్లు.. ఆ రోడ్డులో వెళ్తున్నారా..? బీకేర్‌ఫుల్..! కారుతో కేటుగాళ్లు కాచుక్కుని కూర్చున్నారు..!
Diesel Thieves
Follow us on

అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే.. అర్ధరాత్రి సమయం. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. నిద్ర మత్తు వచ్చిన లారీ డ్రైవర్లు తమ వాహనాలను సమీపంలోని పెట్రోల్ బంక్ ల వద్ద నిలిపి అద మరిచి నిద్రపోతున్నారు. సమయం పన్నెండు గంటలు దాటడం నిద్ర ముంచుకొస్తుండటంతో డ్రైవర్లకు చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పెట్రోల్ బంక్ లోని సిబ్బంది కూడా కుర్చీల్లో కూర్చొని నిద్ర మత్తులోకి జారుకుంటున్నారు.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కారు ముఠాలు. తాము కూడా హైవేలో సుదూరం ప్రయాణిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ పెట్రోల్ బంక్‌లోకి వస్తున్నారు. లారీకి సమీపంలోని తమ కారు నిలిపి రెస్ట్ తీసుకుంటున్నట్లు నటిస్తున్నారు. చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించి, కారులో నుండి దిగి లారీ డీజిల్ ట్యాంక్ వద్దకు వస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా లారీ డీజిల్ ట్యాంక్ లో నుండి ఆయిల్ ను కొట్టేస్తున్నారు. కొట్టేసిన ఆయిల్‌ను కారు డిక్కిలో పెట్టేసి కొద్దీ సేపటి తర్వాత అక్కడ నుండి హైవే మీదుగా చెక్కేస్తున్నారు. అయితే ఈ విషయం తెలియని లారీ డ్రైవర్లు నాలుగైదు గంటల సమయంలో లారీని తీసుకుని కొద్దీ దూరం వెళ్లగానే డీజిల్ అయిపోయిన సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఖంగు తింటున్న లారీ డ్రైవర్లు పెట్రోల్ బంక్ నిర్వాహకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇటువంటి ఘటనే నకరికల్లు మండలం చల్లగుండ్ల పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. దీంతో కారుపై అనుమానం వచ్చిన లారీ డ్రైవర్ పెట్రోల్ బంక్ సిబ్బందికి చెప్పి సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించారు. స్పష్టంగా కారు లారీ పక్కనే పార్క్ చేయడం డ్రైవర్ కారు చుట్టుపక్కల తిరుగాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది.

వీడియో చూడండి…

దీంతో కారులో వస్తున్న ముఠాలే లారీల్లోని డీజిల్ కొట్టేస్తున్నట్లు అర్దమయింది. లారీ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచి కారు ముఠాల ఆటలు కట్టించాలని లారీ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ సిబ్బంది కోరుకుంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..