‘దిశ పథకానికి’ బడ్జెట్ కేటాయింపు.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు

| Edited By: Pardhasaradhi Peri

Feb 11, 2020 | 3:32 PM

‘దిశా పథకం’ అమలుకు రూ. 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా విభాగం అనుమతి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ‘దిశా చట్టం’పై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్నిపేర్కొంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నారని ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను […]

దిశ పథకానికి బడ్జెట్ కేటాయింపు.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు
Follow us on

‘దిశా పథకం’ అమలుకు రూ. 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా విభాగం అనుమతి ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ‘దిశా చట్టం’పై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్నిపేర్కొంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నారని ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు చేసింది.

పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడుగురు అధికారులు, సిబ్బందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.