బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్‌ వేదికగా.. వంశీ, రాజేంద్రప్రసాద్‌ల మధ్య బిగ్ ఫైట్

| Edited By:

Nov 17, 2019 | 6:53 AM

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. అధికార పార్టీకి జైజేలు కొట్టారు. అయితే వంశీ పార్టీ మారుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశంపై టీవీ9 వేదికగా ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్ బిగ్‌‌డిబేట్ చర్చాకార్యాక్రమం జరిగింది. వల్లభనేని వంశీ, టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వల్లభనేని వంశీకి ఆయన […]

బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్‌ వేదికగా.. వంశీ, రాజేంద్రప్రసాద్‌ల మధ్య బిగ్ ఫైట్
Follow us on

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. అధికార పార్టీకి జైజేలు కొట్టారు. అయితే వంశీ పార్టీ మారుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశంపై టీవీ9 వేదికగా ఛానెల్ మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్ బిగ్‌‌డిబేట్ చర్చాకార్యాక్రమం జరిగింది. వల్లభనేని వంశీ, టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

వల్లభనేని వంశీకి ఆయన తండ్రి జన్మనిస్తే.. చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి సన్నిహితమైన దాసరి కుటుంబాన్ని పక్కనబెట్టి.. వంశీకి చంద్రబాబు సీటిచ్చారన్నారు. అంతేకాదు డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని.. మోటార్ల ద్వారా తరలించడానికి వంశీ ప్రయత్నిస్తే.. ఆ సమయంలో దేవినేని ఉమా అడ్డుకున్నారని.. అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు వంశీకి మద్దతు తెల్పుతూ నీటి తరలింపుకు అంగీకరించారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అయితే రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఆగ్రహానికి గురయ్యారు.ఇదే సమయంలో రాజేంద్రప్రసాద్‌, వంశీల మధ్య తీవ్రస్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. పరస్పరం పరుష పదజాలం ఉపయోగిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగారు.