మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. సొంత వర్గాన్ని, పార్టీని వ్యాపారిలా పవన్ అమ్ముకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. షూటింగ్ విరామంలో వచ్చే వ్యాపారికి కాపులు, ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రశ్నించారు. విలువలే లేని పవన్‌కు ఇల్లు శాశ్వతంగా హైదరాబాద్ లోనే ఉంటుందని.. కానీ, ఇల్లాలు మాత్రం ప్రతీ మూడు, నాలుగు సంవత్సరాలకు మారుతుంటారని వ్యక్తిగత విమర్శలతోనూ విరుచుకుపడ్డారు. సీఎం పదవి స్థాయి తగ్గించి మరీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కౌంటర్ ఇచ్చారు జనసేన నాయకులు.
పవన్‌కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. రాజకీయాల్లోనూ యూజ్ అండ్ త్రో వ్యాపారి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఓడిన బీమవరం, గాజువాక నియోజకవర్గాలతో అనుబంధం లేని పవన్ కల్యాణ్.. తన అభిమానులు, నమ్ముకున్న వర్గాన్ని హోల్‌సేల్‌గా అమ్మకానికి పెట్టిన వ్యాపారి అంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. షూటింగ్ విరామంలో వచ్చే వ్యాపారికి ప్రజలైనా, రాష్ట్రమైనా ఒక్కటేనని కాపు కులాన్ని కూడా వదలరంటూ వ్యాఖ్యానించారు సీఎం.
ప్రభుత్వ వేదికలపై సీఎం వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కౌంటర్ ఇచ్చారు జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం పదవి స్థాయిని తగ్గించేలా అసభ్యపదజాలంతో తమ నాయకుడిపై విమర్శలు చేయడం దారుణమంటున్నారు జనసేన నాయకులు. ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు ఆరోపించింది జనసేన.
పవన్ కళ్యాణ్ చట్టపరంగా నడుచుకుంటారని.. ఆయనపై విమర్శలు దుర్మార్గమన్నారు టీడీపీ నాయకులు.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఓటు ట్రాన్స్‌ఫర్‌పై దృష్టి సారిస్తే.. అటు కౌంటర్ ప్లాన్‌తో జగన్ పక్కాగా సామర్లకోట వేదికగా ఎటాక్ మొదలుపెట్టారు.. మొత్తానికి గోదారి జిల్లా సాక్షిగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..