Andhra Pradesh: అర్ధరాత్రి ఇంటిముందు ఎలుగుబంటి.. భయంతో స్థానికులు పరుగులు

|

May 13, 2022 | 12:21 PM

వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ, పట్టణీకరణతో అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. దీంతో జంగిల్ లో ఉండే జీవులకు ఆవాసం లేకుండా పోతోంది. ఆహారం, నివాసం కోసం అవి జనాల మధ్యకు వస్తున్నాయి. తాజాగా...

Andhra Pradesh: అర్ధరాత్రి ఇంటిముందు ఎలుగుబంటి.. భయంతో స్థానికులు పరుగులు
Bear
Follow us on

వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ, పట్టణీకరణతో అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. దీంతో జంగిల్ లో ఉండే జీవులకు ఆవాసం లేకుండా పోతోంది. ఆహారం, నివాసం కోసం అవి జనాల మధ్యకు వస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నరసన్నపేట(Narasannapet) లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అర్ధరాత్రి ఇళ్ల మధ్య సంచిరిస్తూ ఓ ఎలుగుబంటి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ ఇంటి ఆవరణలో తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. గాంధీనగర్ వీధిలోని ఒక అపార్ట్మెంట్లోకి వచ్చిన ఎలుగుబంటి అటు నుంచి స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. ఇంతలో ఎలుగు బంటిని గమనించి.. కుక్కలు అరవడంతో ఎలుగు సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎలుగుబంటి కోసం చుట్టుపక్కల గాలించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు తో పాటు స్థానికులు ఎలుగుబంటి ఆచూకీ గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడి గస్తీ పట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

IPL 2022: కోల్‌కతాకు భారీ షాక్.. దూరమైన రూ. 7.25 కోట్ల ఆటగాడు.. కనీసం 7 మ్యాచ్‌లు ఆడలేకుండానే..

Karate Kalyani: కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి స్ట్రీట్ ఫైట్.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?