APVVP Visakhapatnam Jobs: నెలకు రూ. 52 వేల జీతంతో.. విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అర్హతలివే!

|

Mar 29, 2022 | 8:18 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో ఒప్పంద ప్రాతిపదికన..

APVVP Visakhapatnam Jobs: నెలకు రూ. 52 వేల జీతంతో.. విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అర్హతలివే!
Ap Jobs
Follow us on

APVVP Visakhapatnam Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 53

పోస్టుల వివరాలు: ఆడియో మెట్రీషియన్‌, రేడియోగ్రాఫర్లు, థియేటర్‌ అసిస్టెంట్‌, ఫార్మసిస్ట్‌, పోస్టు మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషిన్‌, ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌, బయో మెడికల్‌ ఇంజనీర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Government Hospital, Pendurti, Visakhapatnam.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Krishna Jobs: కృష్ణా జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..