APVVP Krishna Jobs: కృష్ణా జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Mar 29, 2022 | 7:51 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. కృష్ణా జిల్లా (Krishna District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

APVVP Krishna Jobs: కృష్ణా జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Medical Jobs
Follow us on

APVVP Krishna Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) కమిషనర్‌ కార్యాలయం.. కృష్ణా జిల్లా (Krishna District)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు: బయో మెడికల్‌ ఇంజనీర్లు-3,  ల్యాబ్‌ టెక్నీషియన్లు-3, ఆడియో మెట్రీషియన్‌-1, డింటల్‌ టెక్నీషియన్‌-1, ప్లంబర్‌-2, ఎలక్ట్రీషియన్‌-1, థియేటర్‌ అసిస్టెంట్‌-7, జనరల్ డ్యూటీ అటెండెంట్లు-1, పోస్టు మార్టం అసిస్టెంట్లు-4, కౌన్సెలర్లు-1

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Krishna, Machilipatnam.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 300
  • వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Jobs: నిరుద్యోగులకు అలర్ట్! 2026 నాటికి ఈ మూడు రంగాల్లో 1.2 కోట్ల ఉద్యోగాలు..