ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

|

May 22, 2019 | 1:09 PM

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. జూన్‌ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. ఈమేరకు ఎంప్లాయీస్‌ జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌ విజయవాడలో ప్రకటన విడుదల చేశారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం […]

ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌
Follow us on

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. జూన్‌ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. ఈమేరకు ఎంప్లాయీస్‌ జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌ విజయవాడలో ప్రకటన విడుదల చేశారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఇక.. ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మె సన్నాహక ధర్నాలు, జూన్ మొదటివారం బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెను అణచివేయాలని చూస్తే సహాయనిరాకరణ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.