APS RTC: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు.. 50 శాతం పెంచుతున్నామన్న ఏపీఎస్‌ఆర్టీసీ

|

Oct 06, 2021 | 1:42 PM

దసరా ప్రయాణికుల వీపు మొత మోగించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధవముతోంది. స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసులు చేసుందుకు రెడీ అవుతోంది. 

APS RTC: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు.. 50 శాతం పెంచుతున్నామన్న ఏపీఎస్‌ఆర్టీసీ
Apsrtc
Follow us on

దసరా ప్రయాణికుల వీపు మొత మోగించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధవముతోంది. స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసులు చేసుందుకు రెడీ అవుతోంది.  దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లో స్పెషల్ ఛార్జీలు వసులు చేస్తున్నట్లుగా తెలిపారు. ఓ వైపు బస్సు ఖాళీగా వెళ్తుందని.. కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం పెంచుతున్నామన్నారు. ఇక రెగ్యులర్ సర్వీసులు మాత్రం రద్దు కావన్నారు. వాటిలో సాధారణ ఛార్జ్ లే ఉంటాయన్నారు. దసరా సందర్భంగా 4 వేల ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నెల 8 తేదీ నుంచే 18వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయన్నారు.

ఆన్లైన్‌లో రెగ్యులర్ సర్వీస్‌ల టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలను దోచెయ్యలని RTC భవించదని.. మనుగడ కోసమే చార్జీల పెంపు అని వివరణ ఇచ్చారు.  ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నానని వెల్లడించారు.

కారుణ్య నియామకాలు, ఇతర బెనిఫిట్స్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఆర్ధిక ఇబ్బందులు అధికమించడానికి కార్గో సేవలను విస్తృత పరిచామన్నారు. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పెరిగిన డీజిల్ రేట్లు సంస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి పెద్దగా డిమాండ్ కనపడలేదని.. అయితే తాము మాత్రం ఏర్పట్లు చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Badvel By Election: బద్వేల్‌ బరిలో బీజేపీ లిస్ట్‌.. ఆ ఐదుగురి పేర్లపై అధిష్టానం ఫోకస్..

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. దసరా ముందు ఇదేం బాదుడు..