మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై బస్సు ఎక్కాలంటే ఇది తప్పనిసరి.!

|

Mar 26, 2021 | 11:13 AM

APSRTC Key Decision: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల..

మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై బస్సు ఎక్కాలంటే ఇది తప్పనిసరి.!
Follow us on

APSRTC Key Decision: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రయాణీకులు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరిస్తేనే బస్సుల్లోకి అనుమతిస్తామని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. అలాగే బస్ స్టేషన్లు, బస్సుల్లో శానిటైజర్లను ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్ కాంప్లెక్స్‌లలోని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయిస్తారని స్పష్టం చేసింది. అటు కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఏపీలో కొత్తగా 758 పాజిటివ్ కేసులు నమోదు…

రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 8,95,879కి చేరింది. అలాగే తాజాగా నలుగురు వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7201కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 231 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3,469 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వైరస్‌ను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. అటు పోలీసులు సైతం మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, భారీ జరిమానాలు సైతం విధిస్తున్నారు.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కోవిడ్ హాస్పిటల్స్ సిద్ధం చేయాలని తెలిపారు. చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దృష్ట్యా సర్వే టీమ్స్‌ రంగంలోకి దిగాయి.

Also Read:

రెండో వన్డే: రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔట్.. సూర్యకుమార్ యాదవ్ ఇన్.. టీమిండియాలో మార్పులు..

పిట్టగోడపై కాకి ‘క్యాట్ వాక్’.. అమ్మాయిలను మించి హోయలు ఒలకబోసింది.. మీరూ లుక్కేయండి.!