
ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ఏపీ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఈ బస్సులు తిరిగే రూట్‌లో సర్వేలు నిర్వహిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా కడప, ఒంగోలు, తిరుపతి, గూడూరు, రాపూరు, ఉదయగిరి, ఆత్మకూరుతో పాటు పలు ప్రధాన మార్గాల్లో ఈ బస్సులను నడిపేందుకు సర్వే చేస్తున్నారు. నెల్లూరు నుంచి ఈ రూట్‌లోల ఉండే ప్రయాణికుల రద్దీ, ఇతర పరిస్థితులను అంచనా వేసి దానికి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తేనున్నారు.
అయితే ఈ రూట్‌లో రాకపోకలు సాగించే బస్సుల 15 ఏళ్ల సర్వీస్ గడువు ముగిసి పోవడంతో అవన్ని ప్రస్తుతం స్క్రాప్‌కు వెళ్లిపోయాయి. దీంతో ఈ రూట్‌లో బస్సులు లేక రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్న సమయానికి పూర్తైయితే.. డిసెంబర్ నెలాఖరులోపు ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇక నెల్లూరు 2వ డిపోకు ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. వాటిని ప్రైవేటు సంస్థకు అప్పగించగా.. ప్రతస్తుం నిర్వహణ కోసం వాటిని నెల్లూరు-2 డిపో గ్యారేజీలో ఉంచారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బస్సులకు కావాల్సిన ఛార్జింగ్ స్టేసన్‌లు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ఇవన్న పూర్తి కాగానే బస్సులను అందుబాటులోకి తెస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.