ఓపెన్ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల..

| Edited By:

Aug 08, 2019 | 1:46 PM

ఓపెన్ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 కేంద్రాల్లో 14,676 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో 9,382 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 63.93 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. గుంటూరులో 88 శాతం మంది అత్యధికంతో మొదటిస్థానంలో ఉండగా.. కడప 30 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఇంటర్‌ విద్యార్థులు మొత్తం 47 కేంద్రాల్లో 14,077 మంది హాజరు కాగా.. 7,478 […]

ఓపెన్ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల..
Follow us on

ఓపెన్ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 కేంద్రాల్లో 14,676 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో 9,382 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 63.93 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. గుంటూరులో 88 శాతం మంది అత్యధికంతో మొదటిస్థానంలో ఉండగా.. కడప 30 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఇంటర్‌ విద్యార్థులు మొత్తం 47 కేంద్రాల్లో 14,077 మంది హాజరు కాగా.. 7,478 మంది 53.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో ప్రకాశం 71.96 శాతం మొదటిస్థానంలో నిలవగా, పశ్చిమ గోదావరి జిల్లా 33.49 శాతంతో చివరి స్థానంలో ఉంది.