AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

|

Oct 01, 2022 | 2:47 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతము మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ.. దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 4 .5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఈరోజు బలహీనపడినదని పేర్కొంది.

AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Andhra Rains
Follow us on

శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం మీద కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 5.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతము మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ.. దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 4 .5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఈరోజు బలహీనపడినదని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణ సూచనలు చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 3వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు,రేపు, ఎల్లుండి (అక్టోబర్ 3వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ: ఈరోజు,రేపు, ఎల్లుండి (అక్టోబర్ 3వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..