AP Weather Report: ఏపీలో మరోసారి మోగిస్తున్న డేంజర్ బెల్స్.. రేపు అండమాన్‌ తీరంలో అల్పపీడనం.. ఆ జిల్లాలవారికి హై అలర్ట్..

|

Nov 28, 2021 | 9:14 AM

అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

AP Weather Report: ఏపీలో మరోసారి మోగిస్తున్న డేంజర్ బెల్స్.. రేపు అండమాన్‌ తీరంలో అల్పపీడనం.. ఆ జిల్లాలవారికి హై అలర్ట్..
Weather Forecast
Follow us on

తెలుగు రాష్ట్రాలకు మరో గండం పొంచి ఉందా.. ? అల్పపీడన ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి ? బాగా ఎఫెక్ట్‌ అయ్యే ప్రాంతాలు ఏవంటోంది ఐఎండీ ? ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 30 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒకప్పుడు చినుకు కోసం ఎదురుచూసిన రాయలసీమలను ఇప్పుడు వర్షలు మరింత పలకరిస్తున్నాయి. రోజు రోజుకు కలవరపెడుతున్నాయి. కుండపోత వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు జల సంద్రంగా మారాయి. ఎటుచూసినా నీళ్లే, ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన వెదర్ అలర్ట్ మరింత భయపెడుతున్నాయి. గతం వారం రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. మరో 48గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయంటూ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. వరుణుడి టార్గెట్‌ మళ్లీ రాయలసీమే కాబోతోంది. రాయలసీమ మీదుగానే అల్పపీడనం కొనసాగడం సీమ ప్రజల్ని భయపెడుతోంది

భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..