Telugu News Andhra Pradesh News AP state disaster management agency issues important precautions and Safety Measures to be taken in floods
Knowledge: వరదలు ముంచుకొస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. అధిక వర్షాలమూలంగా లోతట్టుప్రాంతాల్లో వరద ముంచుకొచ్చే ప్రమాదం..
Precautions of Flood: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. అధిక వర్షాలమూలంగా లోతట్టుప్రాంతాల్లో వరద ముంచుకొచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అవగాహన లేమితో అనేక మంది ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. వరద సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ముఖ్యమైన సూచనలు ఇవే..
వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వరదనీటిలోకి ప్రవేశించకూడదు.
మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలి.
విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.
ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హోల్స్ ను గుర్తించి ఆ ప్రదేశం ఇతరులకు కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర
జెండాలు లేదా బారికేడ్లు ఉండాలి.
వరద నీటిలో నడవడం ప్రమాదకరం. వాహనాలను కూడా నడపకూడదు. రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు.
తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని మాత్రమే తినాలి. ఆహారాన్నిప్లేట్/కవర్ తో మూసి ఉంచాలి.