అకారణంగా మందలించారంటూ.. పోలీస్ అర్థనగ్న ప్రదర్శన

| Edited By:

Oct 01, 2019 | 12:02 PM

విజయవాడలో.. శరన్నవరాత్రుల వేళ.. ఓ పోలీస్ అధికారి చేసిన పని కలకలం సృష్టిస్తోంది. దుర్గగుడి టోల్‌గేట్ వద్ద కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన చేశాడు. తన తప్పులేకున్నా తనని మందలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలా వినూత్న నిరసన చేశాడు. ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు ఉండటంతో.. వారిని అడ్డుకున్న ఓ కానిస్టేబుల్‌కి పై అధికారుల నుంచి అక్షింతలు పడ్డాయి. దీంతో.. మనస్తాపంతో చొక్కా విప్పి ఇలా అర్థనగ్న ప్రదర్నశన చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్థరాత్రి […]

అకారణంగా మందలించారంటూ.. పోలీస్ అర్థనగ్న ప్రదర్శన
Follow us on

విజయవాడలో.. శరన్నవరాత్రుల వేళ.. ఓ పోలీస్ అధికారి చేసిన పని కలకలం సృష్టిస్తోంది. దుర్గగుడి టోల్‌గేట్ వద్ద కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన చేశాడు. తన తప్పులేకున్నా తనని మందలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలా వినూత్న నిరసన చేశాడు. ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు ఉండటంతో.. వారిని అడ్డుకున్న ఓ కానిస్టేబుల్‌కి పై అధికారుల నుంచి అక్షింతలు పడ్డాయి. దీంతో.. మనస్తాపంతో చొక్కా విప్పి ఇలా అర్థనగ్న ప్రదర్నశన చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అడ్డుకున్నారు. దీంతో.. కారులోని వారు.. మంత్రికి ఫోన్ చేసి.. ఇవ్వగా.. వారు తిట్ల పురాణం అందుకున్నారు. తన తప్పు లేదని చెప్తున్నా.. వినిపించుకోకుండా.. సస్పెండ్ చేస్తానంటూ బెదిరించారు. దీంతో.. మనస్థాపం చెందిన కానిస్టేబుల్.. దుర్గగుడి టోల్‌ గేట్ వద్ద ఇలా వినూత్న నిరసన చేపట్టాడు. కానీ.. గుడి అధికారులు మాత్రం.. అతనికి ఫిట్స్ వచ్చాయని అందుకే అలా చేశాడని.. ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పడం కొసమెరుపు.