ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. ఆ 23 మున్సిపాలిటీల్లో పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే..
Ap Municipal Elections

ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. ఆ 23 మున్సిపాలిటీల్లో పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే..

Updated on: Nov 12, 2026 | 1:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.. కోర్టు క్లియరెన్స్ రావడంతో 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 26న ఎన్నికలు జరగనుండగా.. 30 ఫలితాలు వెలువడనున్నాయి.

ఏపీలో మళ్లీ మున్సిపల్ వార్‌కు వేళైంది. పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చసింది. కోర్ట్ క్లియరెన్స్ రావడంతో.. నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏపీలో మొత్తం 123 పట్టణ పాలక సంస్థలు ఉండగా.. అందులో 100 చోట్ల ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చిన ఎక్కడైనా ఎన్నిక ఆగితే మర్నాడు.. అంటే 27నే రీపోలింగ్ ఉంటుంది.

ఈనెల 14 , 15,16 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

ఉపసంహరణకు 18వ తేదీ వరకూ గడువు

30న 23పట్టణ సంస్థల ఎన్నికల ఫలితాల కౌంటింగ్

రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల కానుంది.. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైందని.. నామినేషన్‌ వేసే అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని ఈసీ పునేఠా తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాలు..

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు.. ఆముదాలవలస, అల్లూరు, రాజాం, బి.కొత్తపేట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుడివాడ, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, పొదిలి, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు పొలిటికల్ పార్టీలు కూడా అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాయి.

ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు..

ఎన్నికలు జరగాల్సి ఉన్న మున్సిపాలిటీలకు ఇదివరకే రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శ్రీకాకుళంను జనరల్ మహిళకు, రాజమహేంద్రవరాన్ని ఎస్సీ జనరల్‌కు, కాకినాడను బీసీ మహిళకు, మంగళగిరి-తాడేపల్లిని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఈ నాలుగు నగరపాలక సంస్థల పరిధిలో మొత్తం 260 డివిజన్లు ఉండగా.. అందులో బీసీలకు 90, ఎస్సీలకు 35, ఎస్టీలకు 5, మహిళలకు 68 స్థానాలు రిజర్వ్ కాగా, అన్‌రిజర్వ్‌డ్ కింద 62 ఉన్నాయి. 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 749 వార్డులు ఉండగా.. అందులో బీసీలకు 231, జనరల్ మహిళలకు 202, ఎస్సీలకు 106, ఎస్టీలకు 36 వార్డులు కేటాయించగా.. 174 వార్డులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.

Published on: Nov 12, 2026 12:56 PM
Loading...
Unable to load recommendations.
Follow Us