Andhra Pradesh: ఏపీలో 17 మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు ఎన్ని దక్కాయంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా జీవో నంబర్ 252ను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా నగరాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Andhra Pradesh: ఏపీలో 17 మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు ఎన్ని దక్కాయంటే..?
Ap Mayor Reservation List

Updated on: Oct 12, 2026 | 3:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా జీవో నంబర్ 252ను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా నగరాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం 17 కార్పొరేషన్లలో జనరల్ మహిళలకు 5, బీసీలకు 5, అన్ రిజర్వ్‌డ్ (జనరల్) కేటగిరీకి 4, ఎస్సీలకు 2, ఎస్టీకి ఒక స్థానాన్ని ప్రభుత్వం కేటాయించింది. కీలకమైన విశాఖపట్నం, కడపతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు కార్పొరేషన్ల మేయర్ పీఠాలు జనరల్ మహిళల ఖాతాలోకి చేరాయి. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు కార్పొరేషన్లు అన్ రిజర్వ్‌డ్ (జనరల్) జాబితాలో నిలిచాయి.

బీసీలకు ఈ స్థానాలు

బీసీ కేటాయించిన 5 స్థానాల్లో కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించగా.. అనంతపురం, ఏలూరు, చిత్తూరు కార్పొరేషన్లు బీసీ జనరల్‌కు దక్కాయి. ఎస్సీ కోటాలో కర్నూలు కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్సీ మహిళకు, రాజమహేంద్రవరం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. అలాగే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎస్టీ వర్గానికి ఖరారు చేశారు. రిజర్వేషన్లు ఖరారు అవ్వడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

రిజర్వేషన్ల సమగ్ర జాబితా

  • జనరల్ మహిళ (5): విశాఖపట్నం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు
  • అన్-రిజర్వ్‌డ్ – జనరల్ (4): విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు
  • బీసీ మహిళ (2): కాకినాడ, మచిలీపట్నం
  • బీసీ జనరల్ (3): అనంతపురం, ఏలూరు, చిత్తూరు
  • ఎస్సీ మహిళ (1): కర్నూలు
  • ఎస్సీ జనరల్ (1): రాజమహేంద్రవరం
  • ఎస్టీ (1): మంగళగిరి-తాడేపల్లి
Loading...
Unable to load recommendations.
Follow Us