అటెన్షన్ ఎవ్విరిబడీ.. వచ్చేసింది లోకల్‌బాడీ! ఎవరు ఊరికి మొనగాడు?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అక్టోబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించాయి. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకోనున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సవాళ్లు ఉండే అవకాశం ఉంది. కూటమి, వైసీపీ వ్యూహాలతో స్థానిక సమరం మరింత ఆసక్తికరంగా మారుతోంది.

అటెన్షన్ ఎవ్విరిబడీ.. వచ్చేసింది లోకల్‌బాడీ! ఎవరు ఊరికి మొనగాడు?
Ap Local Body Elections 2026

Updated on: Aug 19, 2026 | 9:55 PM

మంగళవారం వెలగపూడి సచివాలయంలో నాలుగ్గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది ఏపీ కేబినెట్ మీటింగ్. ఇందులో అత్యంత ఆసక్తికరం ఏంటంటే, పొలిటికల్ అండ్ పాపులర్ కంటెంటే ఎక్కువగా ఉండడం. కర్నూలు, విశాఖల్లో గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులు, తిరుపతి, సూర్యలంక, కాకినాడలో స్టార్‌ హోటళ్లు.. ఇలా రొటీన్ అనుమతుల్ని మమ అనిపించి, మిగతా టైమ్ అంతా జనరంజక నిర్ణయాలపైనే ఫోకస్ చేశారు. పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌, బీసీ విద్యార్థుల కోసం నీట్‌ కోచింగ్ సెంటర్లు.. ఇలా ఫక్తు ఎలక్షన్ క్యాబినెట్‌నే నడిపించారు సీఎం చంద్రబాబు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని డిసైడవ్వడం ఇంకో మేజర్ బ్రేకింగ్. ఈ ఏడాది అక్టోబర్ ఆఖరులోగా లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించుకోకపోతే ఆర్థికంగా చాలా నష్టపోతాం అనేది సీఎం ఇచ్చిన అల్టిమేట్ స్టేట్‌మెంట్. ఎలక్షన్ కమిషన్ కూడా లోకల్ వార్‌కి నగారా మోగించడానికి రెడీ చెప్పేసింది. సో.. స్థానిక సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ ఐనట్టేగా? మరి, మిగిలున్న సాంకేతిక సమస్యల సంగతేంటి? ఏపీ పాలిటిక్స్‌లో సెమీఫైనల్‌కి ముహూర్తం ఫిక్సయింది. మహా ఐతే ఇంకో నెలానెలన్నరే బ్యాలెన్స్. స్టేట్‌వైడ్ కటౌట్లన్నీ లోకల్‌ గల్లీల్లో వాలిపోడానికి డేట్లు రాసుకుంటున్నాయి. ఔను, వీలైనంత త్వరగా స్థానికసంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి