Insider Trading: రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన హైకోర్టు

|

Jan 19, 2021 | 12:56 PM

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని ప్రభుత్వం ఆరోపించింది.

Insider Trading: రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన హైకోర్టు
Follow us on

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొందరు అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారని ప్రభుత్వం ఆరోపించింది. అయితే  భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని అతడు తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది.  ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని ధర్మాసనం వెల్లడించింది.

Also Read:

SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!

బైంసా పట్టణంలో విషాదం.. కరెంట్ తీగలలో చిక్కుకున్న పతంగి.. తీసేందుకే స్టీల్ రాడ్‌తో ప్రయత్నించగా..