Category 2 House: 24 రోజుల్లో తొలి ఇంటి నిర్మాణం.. ఏపీ ప్రభుత్వం కట్టించిన కొత్త ఇల్లుపై ఓ లుక్కేయండి

|

Jan 18, 2021 | 8:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో నవ రత్నాల్లో భాగంగా పేదలందిరికి ఉచితంగా పట్టాలు పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వం. అనివార్య కారణాల వల్ల పలుసార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని...

Category 2 House:  24 రోజుల్లో తొలి ఇంటి నిర్మాణం.. ఏపీ ప్రభుత్వం కట్టించిన కొత్త ఇల్లుపై ఓ లుక్కేయండి
Follow us on

Category 2 House:  ఆంధ్రప్రదేశ్‌లో నవ రత్నాల్లో భాగంగా పేదలందిరికి ఉచితంగా పట్టాలు పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వం. అనివార్య కారణాల వల్ల పలుసార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ డిసెంబర్ 25న  ప్రారంభించారు. పట్టాల పంపిణీ అనంతరం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో గ్రామంలో లబ్ధిదారు నరాల రత్నకుమారి రాష్ట్రంలోనే మొదటిగా సెకండ్ కేటగిరీ కింద ఇంటిని నిర్మించారు. ఈ గృహాన్ని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు ఆదివారం ప్రారంభించారు.

కాగా రెండో కేటగిరీ  ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందజేస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారే సమకూర్చుకోవాలి. గత నెల 25న అధికారులు రత్నకుమారికి ఇంటి పట్టా అందజేయగా.. 24 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. అధికారులు సహకారం, ప్రభుత్వ సాయంతో పాటు.. తమ వ్యయం కలిపి మొత్తం రూ.3 లక్షలైందని ఆమె వివరించారు. రెండో కేటగిరీ కింద రాష్ట్రంలోనే మొదటిగా రత్నకుమారి ఇల్లు నిర్మించారని గృహ నిర్మాణశాఖ ఏఈ ఆర్.వి సుబ్బారావు చెప్పారు.

Also Read : Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ