ఏపీలో ఈ నెల విద్యుత్ రీడింగ్ లేదు..బిల్లులు ఎలా వేస్తారంటే..?

|

Mar 25, 2020 | 2:42 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యుత్ సంస్థ‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. గ‌తంలో సంస్థ ఉద్యోగి ఇంటింటికి వ‌చ్చి రీడింగ్ తీసుకుని..వినియోగ‌దారుల‌కు బిల్లులు ఇచ్చేవారు. కానీ ప్ర‌స్తుతం క‌రోనా కాటేస్తున్న వేళ‌..స్పాట్ బిల్లింగ్ ను నిలిపివేయ‌నున్నాయి. గ‌త 3 నెల‌ల్లో విద్యుత్ వినియోగాన్ని బ‌ట్టి..మార్చి నెల విద్యుత్ బిల్లుల‌ను నిర్ణ‌యించ‌నున్నారు. స‌ద‌రు బిల్లుల‌ను అధికారిక వెబ్ సైట్లో పొందుప‌రుచ‌నున్నారు. వినియోగ‌దారులు ఆన్ లైన్ పేమెంట్స్ ద్వారా విద్యుత్ బిల్లుల‌ను చెల్లించాల‌ని సంస్థ‌లు కోరాయి. అయితే వాస్త‌వ వినియోగం ప్ర‌కారం మార్చి […]

ఏపీలో ఈ నెల విద్యుత్ రీడింగ్ లేదు..బిల్లులు ఎలా వేస్తారంటే..?
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యుత్ సంస్థ‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. గ‌తంలో సంస్థ ఉద్యోగి ఇంటింటికి వ‌చ్చి రీడింగ్ తీసుకుని..వినియోగ‌దారుల‌కు బిల్లులు ఇచ్చేవారు. కానీ ప్ర‌స్తుతం క‌రోనా కాటేస్తున్న వేళ‌..స్పాట్ బిల్లింగ్ ను నిలిపివేయ‌నున్నాయి. గ‌త 3 నెల‌ల్లో విద్యుత్ వినియోగాన్ని బ‌ట్టి..మార్చి నెల విద్యుత్ బిల్లుల‌ను నిర్ణ‌యించ‌నున్నారు. స‌ద‌రు బిల్లుల‌ను అధికారిక వెబ్ సైట్లో పొందుప‌రుచ‌నున్నారు.

వినియోగ‌దారులు ఆన్ లైన్ పేమెంట్స్ ద్వారా విద్యుత్ బిల్లుల‌ను చెల్లించాల‌ని సంస్థ‌లు కోరాయి. అయితే వాస్త‌వ వినియోగం ప్ర‌కారం మార్చి నెల బిల్ల‌లో ఏమైనా బారీ తేడాలు ఉంటే…ఆ త‌ర్వాతి నెల‌లో స‌ర్దుబాట్లు చేయ‌నున్నారు. అటు త‌మ సిబ్బందితో పాటు ప్ర‌జ‌ల సేప్టీ కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విద్యుత్ సంస్థ‌లు వెల్ల‌డించాయి.