AP News: ఆ ఐపీఎస్‌ ఆఫీసర్లపై ఏపీ డీజీపీ ఫుల్ సీరియస్.. మెమోలు జారీ.. ఎందుకంటే

|

Aug 14, 2024 | 6:08 PM

ఏపీలో పోస్టింగ్‌లకు దూరమై వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులపై ఫుల్‌ సీరియస్‌గా ఉన్నారు డీజీపీ. పోస్టింగ్‌ లేకపోవడంతో ఆఫీసుకు రాకుండా కాలక్షేపం చేస్తున్న ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు.

AP News: ఆ ఐపీఎస్‌ ఆఫీసర్లపై ఏపీ డీజీపీ ఫుల్ సీరియస్.. మెమోలు జారీ.. ఎందుకంటే
Ap Police
Follow us on

ఏపీలో పోస్టింగ్‌లకు దూరమై వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులపై ఫుల్‌ సీరియస్‌గా ఉన్నారు డీజీపీ. పోస్టింగ్‌ లేకపోవడంతో ఆఫీసుకు రాకుండా కాలక్షేపం చేస్తున్న ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని వారికి మెమోలు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులు ప్రతిరోజూ ఉదయం పదికల్లా ఆఫీసుకు రావాలని స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేశారు.

ఇక పోస్టింగ్ లేకపోవడంతో.. పత్తా లేకుండా పోయిన డీజీ స్థాయి నుంచి పలు హోదాల్లో ఉన్న ఐపీఎస్‌లు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 16 మంది పేర్లతో కూడిన జాబితాతో డీజీపీ మెమో జారీ అయ్యింది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారుల్లో పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్ డీజీపీ స్థాయి అధికారులు. సంజయ్‌ది అడిషనల్ డీజీ స్థాయి. కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, పాలరాజు ఐజీలు. అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్ని డీఐజీలు.

రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌పటేల్, అన్బురాజన్ ఎస్పీ స్థాయి అధికారులు. వీరంతా వెయిటింగ్‌లో ఉన్నారు. వీరందరికి ఏపీ డీజీపీ నోటీస్ ఇష్యూ చేశారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్‌లో ఉండాలని నోటీస్ సర్వ్ చేశారు. వెయిటింగ్‌ హాల్‌లో ఉన్న రిజిస్టర్‌లో సంతకం చేయాలని సూచించారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..