Cyclone Alert: తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్.. ఇదిగో లెస్ట్‌ వెదర్ రిపోర్ట్‌

ఏపీని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది. ఇది క్రమంగా బలపడి సోమవారానికి తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత ఈ నెల 17న తీవ్ర తుఫాన్‌గా మారి 19న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Cyclone Alert: తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్.. ఇదిగో లెస్ట్‌ వెదర్ రిపోర్ట్‌
Ap Cyclone Warning

Updated on: Nov 16, 2026 | 6:00 AM

ఏపీకి మరో తుఫాన్ ముప్పు వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 15కిమీ వేగంతో ఉత్తరవాయవ్య దిశగా కదులుతుందని .. ప్రస్తుతానికి ఇది శ్రీలంకలోని టింకోమలికి 620 కి.మీ, శ్రీ విజయ పురానికి (అండమాన్ నికోబార్ దీవులు) 680 కి.మీ, చెన్నైకి 800 కి.మీ, విశాఖపట్నానికి 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తుపానుగా, మంగళవారానికి ఇది పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆ తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి మంగళవారం వరకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు , ఆతరువాత క్రమంగా పెరుగుతాయని తెలిపారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us