AP farmers police stations : ఏపీలో అన్నదాతలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. త్వరలో జిల్లాకో రైతు పోలీస్‌స్టేషన్‌..!

|

Feb 02, 2021 | 5:29 PM

అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

AP farmers police stations : ఏపీలో అన్నదాతలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. త్వరలో జిల్లాకో రైతు పోలీస్‌స్టేషన్‌..!
AP farmers
Follow us on

Farmers police stations in AP :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం.. అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రక్షణగా పోలీస్‌ వ్యవస్థ ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్‌స్టేషన్‌ ఆలోచన చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు న్యాయం చేయడం కోసం వ్యవస్థ ఏర్పాటు కావల్సిన అసరముందన్నారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. మరోవైపు, ప్రతీ పీఎస్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని’ సీఎం జగన్ తెలిపారు.

Read Also.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అభినందించిన వెంకయ్యనాయుడు.. కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరుపై ప్రశంసలు..