CM Chandrababu: ఫిర్యాదు చేస్తే భూమిని అప్పగించే బాధ్యత నాది.. భూకబ్జా బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా..

|

Jul 15, 2024 | 7:14 PM

భూకబ్జాలు, సహజవనరుల దోపిడీపై ఏపీ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దాని విలువ 35వేల కోట్లకు పైగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి తమ రికవరీలో కబ్జా భూమి 1.70లక్షల ఎకరాలుగా తేలిందన్న ముఖ్యమంత్రి.. మరిన్ని బయటకు రావాల్సి ఉందన్నారు.

CM Chandrababu: ఫిర్యాదు చేస్తే భూమిని అప్పగించే బాధ్యత నాది.. భూకబ్జా బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా..
AP CM Chandrababu Naidu
Follow us on

భూకబ్జాలు, సహజవనరుల దోపిడీపై ఏపీ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దాని విలువ 35వేల కోట్లకు పైగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి తమ రికవరీలో కబ్జా భూమి 1.70లక్షల ఎకరాలుగా తేలిందన్న ముఖ్యమంత్రి.. మరిన్ని బయటకు రావాల్సి ఉందన్నారు. ఇష్టానుసారం భూములను ఆక్రమించేశారంటూ.. వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. సామాన్యుల పట్ల, అసైన్డ్‌ భూముల పట్ల దాష్టికంగా వ్యవహరించారన్నారు. కబ్జాదారుల దౌర్జన్యంతో భూములు కోల్పోయిన వారికి… భరోసా ఇచ్చారు చంద్రబాబు.

వీడియో చూడండి..

భూకబ్జా బాధితులు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జా బాధితులకు… తిరిగి భూమిని ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఎవరి భూమిని వారికి అప్పగించే బాధ్యత తనదంటూ స్పష్టంచేశారు. మరి, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో.. చాలా మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..