Ration: ఇష్టమైతేనే డబ్బు.. లేకుంటే బియ్యం.. నగదు బదిలీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

|

Apr 21, 2022 | 8:32 AM

రేషన్(Ration) కు నగదు బదిలీపై పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. కార్డుదారులకు ఇష్టముంటేనే నగదు తీసుకోవాలి..లేకపోతే బియ్యం తీసుకోవచ్చని అన్నారు. ఈ...

Ration: ఇష్టమైతేనే డబ్బు.. లేకుంటే బియ్యం.. నగదు బదిలీపై మంత్రి కీలక వ్యాఖ్యలు
fortified rice
Follow us on

రేషన్(Ration) కు నగదు బదిలీపై పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. కార్డుదారులకు ఇష్టముంటేనే నగదు తీసుకోవాలి..లేకపోతే బియ్యం తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని వెల్లడించారు. ఒక నెల నగదు తీసుకున్నాక, తర్వాత నెల బియ్యం కావాలంటే ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నగదు బదిలీని అమలు చేయాలని 2017లోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందన్న మంత్రి.. ఇప్పటికే 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారన్నారు. ఆరోగ్యం దృష్ట్యా కొందరు జొన్నలు, రాగులు, ముడిబియ్యం వంటివి తింటున్నారని, రేషన్‌ బియ్యం బదులు నగదు తీసుకుంటే వాటిని కొనుగోలు చేసే వీలుంటుందని మంత్రి వివరించారు. సీఎం తో చర్చించి, ధర నిర్ణయించాక రెండు, మూడు పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. నగదు బదిలీపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని, డబ్బులు తీసుకుంటే కార్డు తీసేస్తారని చెబుతున్న మాటలను నమ్మవద్దని సూచించారు. ఎవరి కార్డూ తీసేయమని స్పష్టం చేశారు.

రేషన్ ఇచ్చే విధానంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. రేషన్ వద్దనుకుంటే వారికి డబ్బులు ఇచ్చేందుకు సమాయత్తమైంది. డబ్బులు వద్దనుకుంటే సరకులు తీసుకోవచ్చు. మే నెల నుంచి ఈ నగదు బదిలీ కార్యక్రమం అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావించి, ఆ తరువాత విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. నగదు బదిలీకి అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు. బియ్యానికి బదులు నగదు ఇచ్చే విధానంపై ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకుంటారు. వారు అంగీకరిస్తే డబ్బులు ఇస్తారు.

Also Read

సుడిగుండం అనుకుంటే పొరపాటే !! అసలు విషయం తెలిస్తే షాకవుతారు !!

Guntur: నేనుండి మాత్రం ఏం చేయాలి.. భర్త చనిపోయాడని భార్య బలవన్మరణం

DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..