BIG BREAKING: రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

|

Mar 16, 2021 | 9:46 AM

బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

BIG BREAKING: రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు
Chandrababu
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి నోటీసులు జారీ చేశారు ఏపీ సీఐడీ అధికారులు. అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు..ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. అమరావతి భూముల్లో అవకతవకలపై విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు.

41 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

మరోవైపు చంద్రబాబుకు నోటీసులివ్వడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని భూములపై ప్రభుత్వం రెండు కమిటీలు వేసిందన్నారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చాకే సీఐడీ నోటీసులు ఇచ్చిందన్నారు.
ఆరోపణలొచ్చినప్పుడు విచారణ జరిపితే తప్పేముందని ప్రశ్నించిన బొత్స..విచారణ జరిగితేనే వాస్తవాలు బయటికొస్తాయన్నారు.

ఐతే ఆధారాలుంటే 21 నెలలుగా ఏం చేశారని ప్రశ్నించారు బోండా ఉమ. కావాలనే రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధానిపై మొదట్నుంచీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని..అధికారులతో కమిటీ, మంత్రులతో సబ్‌ కమిటీ కూడా వేశారన్నారు. కానీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎక్కడా జరగలేదని హైకోర్ట్‌ స్పష్టం చేసిందన్నారు. మేం అక్రమాలు చేయలేదు కాబట్టే ఇన్నాళ్లూ మమ్మల్నేం చేయలేదన్నారు. సీఐడీ నోటీసులిచ్చింది కాబట్టి విచారణకు హాజరవుతామన్నారు. సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు.