ముగిసిన ఏపీ క్యాబినేట్ భేటీ.. పలు కీలక చట్ట సవరణలతో పాటు పాలసీలకు ఓకే చెప్పిన కేబినేట్. రైతుల సమగ్ర భూ సర్వేకు ఆమోదం.

|

Dec 18, 2020 | 2:48 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేటినేట్ భేటి ముగిసింది. రెండున్నర గంటల పాటు సాగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ముగిసిన ఏపీ క్యాబినేట్ భేటీ.. పలు కీలక చట్ట సవరణలతో పాటు పాలసీలకు ఓకే చెప్పిన కేబినేట్. రైతుల సమగ్ర భూ సర్వేకు ఆమోదం.
Follow us on

ap cabinet meeting decisions: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేటినేట్ భేటి ముగిసింది. రెండున్నర గంటల పాటు సాగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక పాలసీని కేబినెట్‌ ఆమోదించింది.
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని భూమిని సర్వే చేసి రికార్డు తయారు చేస్తామని, దీని ద్వారా రైతుల భూములకు ర‌క్ష‌ణ‌ కల్పిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇక ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని, ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నివర్‌ తుపాను బాధితులకు ఈనెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు బకాయి పెట్టిన 1200 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించామని పేర్ని నాని వివరించారు.