తూర్పుగోదావరిజిల్లాలో మరో అపచారం.. అట్టుడికిన గ్రామం

|

Sep 12, 2020 | 4:44 PM

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు కలవరపరుస్తున్నాయి. అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటన మొత్తం రాష్ట్రాన్నే కుదిపేస్తుంటే, మరో ఘటన అదే తూర్పుగోదావరిజిల్లాలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరిజిల్లాలో మరో అపచారం.. అట్టుడికిన గ్రామం
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు కలవరపరుస్తున్నాయి. అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటన మొత్తం రాష్ట్రాన్నే కుదిపేస్తుంటే, మరో ఘటన అదే తూర్పుగోదావరిజిల్లాలో చోటుచేసుకుంది.రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతి పరిధిలో ఈ అపచారం జరిగింది. వెంకటగిరిలోని మునసబుగారి వీధిలోని ఓ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి మలాన్ని పూసారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి సమయంలో అసాంఘిక శక్తులు కొందరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బొమ్మూరు రేంజ్ డీఎస్పీ మాట్లాడుతూ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించామని నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.