Anna canteen: కడపలో ఉద్రిక్తత.. రాత్రికి రాత్రే అన్న క్యాంటీన్ కూల్చివేత

|

Mar 23, 2022 | 1:12 PM

కడప నగరంలో అన్న క్యాంటీన్ (Anna Canteen) కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత మున్సిపాలిటీ ఆఫీస్ రోగులు, వారి బంధువుల ఆకలి తీర్చేందుకు టీడీపీ (TDP) హయాంలో రూ.30 లక్షలు వెచ్చించి...

Anna canteen: కడపలో ఉద్రిక్తత.. రాత్రికి రాత్రే అన్న క్యాంటీన్ కూల్చివేత
Kadapa Anna Canteen
Follow us on

కడప నగరంలో అన్న క్యాంటీన్ (Anna Canteen) కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత మున్సిపాలిటీ ఆఫీస్ రోగులు, వారి బంధువుల ఆకలి తీర్చేందుకు టీడీపీ (TDP) హయాంలో రూ.30 లక్షలు వెచ్చించి అధునాతనంగా అన్న క్యాంటీను ఏర్పాటు చేశారు. అయిదు రూపాయల ధరలో అల్పాహారం, భోజనం అందించేవారు. ఈ అన్న క్యాంటీన్‌లో రోజూ దాదాపు 500 మంది పేదలు, ఇతరులు భోజనం చేసేవారు. వైసీపీ (YCP) అధికారం చేపట్టాక అన్న క్యాంటీన్లను నిలిపేశారు. ఆ తర్వాత కడపలోని అన్న క్యాంటీన్‌ భవనాన్ని కొవిడ్‌ కేంద్రంగా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అన్న క్యాంటీన్ భవనాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది రాత్రికి రాత్రే కూల్చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. క్యాంటీన్‌లోని విలువైన, ఉపయోగపడే వస్తువులను కూడా బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

కడప నియోజకవర్గ టీడీపీ నేత అమీర్‌బాబు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కూల్చివేసిన క్యాంటీన్ ప్రాంతంలో నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెట్రోలు బంకు ఏర్పాటు కోసం నగరంలో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అన్న క్యాంటీన్‌ భవనాన్ని కూల్చడం వైసీపీ ప్రభుత్వం కక్ష పూరిత విధానానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చిన అన్నా క్యాంటీన్ ను తిరిగి పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భవనాన్ని పునః నిర్మించే వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Also Read

Drones: విస్తృతంగా డ్రోన్‌ సేవలు.. అందుబాటులోకి వచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌

Realme GT Neo 3: 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో మార్కెట్లో విడుదలైన రియల్‌మీ జీటీ 3

Novavax: నొవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి.. ఆ వయస్సు వారికి అందుబాటులోకి టీకా