Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ

|

Aug 13, 2022 | 8:12 AM

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ
Follow us on

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సి. నాగరాణి బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది ప్రభుత్వం. అలాగే చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా ఎం.ఎం. నాయక్‌ఖాదీ విలేజ్‌ సీఈవో, ఆప్కో ఎండీగా నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సర్వ శిక్షాభియాన్‌ అదనపు పీడీగా శ్రీనివాసరావు, రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాస రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలల మౌలిక వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్‌, మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా జయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి