Andhra Pradesh: మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్, రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

|

Jan 22, 2021 | 11:31 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో..

Andhra Pradesh: మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్, రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై నేడు రాష్ట్ర ఉన్నతాధికారులతో ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాపై ఈ సమావేశంలో చర్చింనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనికి ముందు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ కాటున్నారు. పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌తో చర్చించనున్నారు.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిన విషయం తెలిసిందే. అలాగే ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చునని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు కూడా చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Also read:

Anupama: ‘పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతిలో నడక.. అందమైన చిరునవ్వు’.. ఆకట్టుకుంటోన్న అనుపమ హావభావాలు..

షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్‌గా జాన్ అబ్రహం.. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..