Andhra Pradesh: ఫోన్ చేశారు.. కనిపించకుండా పోయారు.. రంగంలోకి రెండు బోట్లు.. ఒక హెలికాప్టర్..

|

Jul 06, 2022 | 2:20 PM

Search Operation: మత్స్యకారుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా.. వాళ్లు ఉన్న లొకేషన్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మూడు బోట్స్, నేవీకి చెందిన ఒక చాపర్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

Andhra Pradesh: ఫోన్ చేశారు.. కనిపించకుండా పోయారు.. రంగంలోకి రెండు బోట్లు.. ఒక హెలికాప్టర్..
Search Operation
Follow us on

మచిలీపట్నంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మత్స్యకారుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా.. వాళ్లు ఉన్న లొకేషన్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మూడు బోట్స్, నేవీకి చెందిన ఒక చాపర్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.  మచిలీపట్నం క్యాంప్‌బెల్‌పేటకు చెందిన చిన్నమస్తాన్‌, చిననాంచారయ్య, నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు శనివారం గిలకలదిండి నుంచి మరబోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఏడు గంటల టైమ్లో వారు మరబోటు అంతర్వేది దగ్గర చెడిపోయిందంటూ బోటు యజమాని ఏడుకొండలుకు ఫోన్‌ చేశారు. దీంతో రిపేర్‌ చేసి బోటును తీసుకువచ్చేందుకు మరో బోటులో కొందరు వెళ్లారు. అయితే అక్కడ బోటు కనిపించకపోవడంతో వెనక్చి తిరిగి వచ్చేశారు. ఇటు నలుగురు మత్స్యకారుల సెల్‌ఫోన్లు స్విచాప్‌ కావడంతో పరిస్థితి ఏంటి అనేది తెలియకుండా పోయింది.

వాస్తవానికి వేట ముగించుకుని మంగళవారం మత్స్యకారులు తిరిగి రావాల్సి ఉంది. అయితే వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇటు మాజీమంత్రి పేర్నినాని చొరవతో కొస్ట్‌గార్డ్‌ రంగంలోకి దిగింది. కాకినాడ- అంతర్వేది, అంతర్వేది-మచిలీపట్నం మధ్య హై స్పీడ్‌ బోటులు ద్వారా గాలించారు. కానీ నలుగురి ఆచూకీ దొరకలేదు. దీంతో నేవి హెలికాప్టర్‌ ద్వారా సుమారు మూడు గంటలపాటు వెతికారు. చీకటి పడడంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. తిరిగి ఇప్పుడు గాలింపు ప్రారంభించనున్నారు.