AP Holidays 2024: వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు.. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసొచ్చిన పండగ దినాలు
ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్-2024ను ప్రభుత్వం గురువారం (నవంబర్ 30) విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2024 సంవత్సరానికి గానూ 20 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్ హాలిడేస్) సెలవులు 17 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా..
అమరావతి, డిసెంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్-2024ను ప్రభుత్వం గురువారం (నవంబర్ 30) విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2024 సంవత్సరానికి గానూ 20 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్ హాలిడేస్) సెలవులు 17 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉల్ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తరువాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చే వరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
2024లో సాధారణ సెలవులు ఇవే…
సంక్రాంతి జనవరి 15 (సోమవారం)- 2024
కనుమ 16 (మంగళవారం)- 2024
రిపబ్లిక్ డే జనవరి 26 (శుక్రవారం)- 2024
మహాశివరాత్రి మార్చి 8 (శుక్రవారం)- 2024
హోలీ మార్చి 25 (సోమవారం)- 2024
గుడ్ ఫ్రైడే మార్చి 29 (శుక్రవారం)- 2024
బాబు జగ్జీవన్‌రామ్ జయంత్రి ఏప్రిల్ 5 (శుక్రవారం)- 2024
ఉగాది ఏప్రిల్ 9 (మంగళవారం)- 2024
రంజాన్ ఏప్రిల్ 11 (గురువారం)- 2024
శ్రీరామనవమి ఏప్రిల్ 17 (బుధవారం)- 2024
బక్రీద్ జూన్ 17 (సోమవారం)- 2024
మొహర్రం జూలై 17 (బుధవారం)- 2024
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 (గురువారం)- 2024
శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 26 (సోమవారం)- 2024
వినాయకచవితి 7 సెప్టెంబరు (శనివారం)- 2024
ఈద్-మిలాద్-ఉన్-నబీ సెప్టెంబరు 16 (సోమవారం)- 2024