Andhra Pradesh: బాలినేని పార్టీ మారుతున్నారా? మీడియా ముందుకొచ్చి ఏం చెప్పారంటే..

|

Aug 10, 2022 | 9:09 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడుతున్నారా? త్వరలోనే జనసేనలో చేరనున్నారా? ఇప్పుడిదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Andhra Pradesh: బాలినేని పార్టీ మారుతున్నారా? మీడియా ముందుకొచ్చి ఏం చెప్పారంటే..
Balineni Srinivasa Reddy
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడుతున్నారా? త్వరలోనే జనసేనలో చేరనున్నారా? ఇప్పుడిదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తాజాగా ఈ ప్రచారంపై బాలినేని స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరబోతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలేనని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. “నాకు వైఎస్ఆర్ రాజకీయ భిక్షపెట్టారు. చివరి వరకు వైసీపీలోనే ఉంటా. పార్టీలు మారే ప్రసక్తే లేదు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను. కార్యకర్తల కోసం పోరాటం చేస్తా. ఇటీవల కాలంలో నన్ను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాను.” అని క్లారిటీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిదశ మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చొటు దక్కింది. అయితే, సీఎం జగన్ ముందే ప్రకటించిన విధంగా రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేశారు. ఇందులో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అలా మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు నిరంతరం వార్తల్లో ప్రధాన హెడ్డింగ్‌లో నిలుస్తోంది. నాటి నుంచి ప్రతీసారి ఆయన పార్టీ మారుతారనే టాపిక్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం మరింత పెరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..