Jagan meet Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ గంటకు పైగా చర్చలు.. రేపు ప్రధాని మోదీని కలవనున్న ఏపీ సీఎం!

|

Apr 28, 2022 | 8:16 PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గవర్నర్‌ నిన్ననే ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి రావడం, ఇవ్వాళే సీఎం జగన్‌ వెళ్లి కలడంతో, ఈ మీటింగ్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

Jagan meet Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ గంటకు పైగా చర్చలు.. రేపు ప్రధాని మోదీని కలవనున్న ఏపీ సీఎం!
Jagan Meet Governor
Follow us on

CM YS Jagan Mohan Reddy meet AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గవర్నర్‌ నిన్ననే ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి రావడం, ఇవ్వాళే సీఎం జగన్‌ వెళ్లి కలడంతో, ఈ మీటింగ్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు హస్తీనకు వెళ్తున్న జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నట్లు సమాచారం.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ , సిఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సమాజిక అంశాలపై వీరిద్దరూ లోతుగా సమాలోచనలు జరిపారు.

దాదాపు గంటసేపు ఈ ఇద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్‌కు వివరించారు ముఖ్యమంత్రి జగన్. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన ప్రజలకు చేరువైందని, గవర్నర్‌కు చెప్పారు సీఎం. గంటపాటు సాగిన గవర్నర్, జగన్ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌, రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిశారు. ఢిల్లీ నుంచి నిన్న విజయవాడ చేరుకున్న గవర్నర్‌తో ఇవాళ జగన్‌ భేటీ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు రేపు ఢిల్లీ వెళ్లీ ప్రధాని మోదీని కలవనున్నారు జగన్‌. ఇలా వరుస భేటీలతో ఏపీలో పొలిటికల్‌ అటెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది.

రేపు ఢిల్లీ వెళ్లనున్న జగన్, ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మోదీతో సమావేశానికి ముందు, గవర్నర్‌తో కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్‌ ఢిళ్లీ టూర్‌లో ప్రధాని, కేంద్రమంత్రులతో జరిగిన మీటింగ్‌లపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. గవర్నర్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం, రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు.

Read Also….  Vidadala Rajini: గ్రాండ్ పార్టీ ఇచ్చిన విడదల రజనీ.. మహిళా మంత్రి విందుకు అనుకోని అతిథి!