Shyamala: ‘పెద్దలు బాబు గారికి కంగ్రాట్స్..’ కానీ భయంగా ఉందంటున్న శ్యామల

|

Jun 07, 2024 | 3:16 PM

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను, వైసీపీ పార్టీని సపోర్ట్ చేయడానికి యాంకర్ శ్యామల ముందుకొచ్చింది. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అంతే కాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వైసీపీ సపోర్ట్‌గా మాట్లాడుతూ.. ఇతర పార్టీలపై, పార్టీ నాయకులపై ఘాటైన విమర్శలు చేసింది.

ఏపీ ఎన్నికల వేళ యాంకర్ శ్యామల హాట్ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న యాంకర్ శ్యామల.. ఆ పార్టీ విజయం కోసం గట్టిగానే పనిచేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు శ్యామల. కీలకమైన నియోజక వర్గాల్లో ప్రచారం చేసి జగన్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కల్యాణ్‌పై, కూటమి చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ డిజాస్టర్ అవ్వడంతో శ్యామల స్పందించారు.

“ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ముందుగా అఖండ విజయాన్ని నమోదు చేసిన కూటమికి శుభాకాంక్షలు. పెద్దలు చంద్రబాబు గారికి, పవన్ కల్యాణ్ గారికి, పురందేశ్వరి గారికి అభినందనలు. అదే వైసీపీ గెలుపుకోసం కస్టపడ్డ కార్యకర్తలు అందరికీ థ్యాంక్స్. ఓడిపోయాం. కానీ గెలిచిన నాడు విర్రవీగలేదు.. ఓడిపోయన నాడు కుంగిపోలేదు. అలానే ఈ సారి కూడా జగన్ గారు మరింత బలాన్ని పుంజుకుని.. ఖచ్చితంగా.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలకు మంచి జరగాలని కోరకుంటున్నా. ఎప్పటికీ జగన్‌తోనే ప్రయాణం. ఈ అయిదేళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని శ్యామల పేర్కొన్నారు.

ఇక చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు శ్యామల. ఒక రకమైన భయంగా ఉందన్నారు. “మీకు నచ్చనిది నాకు నచ్చిందని చెప్పి మీరు బ్రతకడానికే వీలు లేదు అనడం అన్యాయమన్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు. ఎప్పటికీ చేయను కూడా. ఎవరన్నా కూడా నాకు చాలా గౌరవం. దయజేసి మీరు కూడా ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశాను” అని శ్యామల వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..