Andhra Pradesh: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టిన అల్లుడు.. అర్థరాత్రి అత్తింటికి వెళ్లి..

|

Oct 14, 2021 | 10:33 AM

Andhra Pradesh: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి సమయంలో అత్తింటికి వెళ్లి.. మామను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా చంపేశాడు.

Andhra Pradesh: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టిన అల్లుడు.. అర్థరాత్రి అత్తింటికి వెళ్లి..
Crime News
Follow us on

Andhra Pradesh: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి సమయంలో అత్తింటికి వెళ్లి.. మామను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన కడప జిల్లాలోని రాయచోటి మండలం మాధవరం గ్రామం మద్దేలకుంట వాండ్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం గ్రామం మద్దెల కుంట వాండ్ల పల్లెకు చెందిన సుబ్బరాయుడు కుమార్తె పద్మజ ను వరిగ గ్రామం ఆవుల శెట్టి వారి పల్లెకు చెందిన దేరంగుల సిద్ధయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. సిద్ధయ్య ఉపాధి నిమిత్తం మూడు సవత్సరాలు సౌదీ అరేబియాకు వెళ్లాడు. నలబై రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, సిద్దయ్య ఇంటికి వచ్చినప్పటి నుండి బార్య పద్మజ పై అనుమానం పెంచుకున్నారు.

ఆ క్రమంలో ఆమెతో తరచుగా గొడవ పడుతుండేవాడు. దాంతో పద్మజ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే తన బార్యను కాపురానికి పంపాలంటూ పద్మజ తల్లిదండ్రులు పై సిద్దయ్య ఒత్తిడి చేశాడు. దానికి స్పందించి పద్మజ తల్లిదండ్రులు.. పెద్ద మనుషులతో మాట్లడి పంపిస్తాం అని చెప్పారు. అయినప్పటికీ వినకుండా ఆగ్రహంతో రగిలిపోయిన సిద్దయ్య.. అర్థరాత్రి పద్మజ పుట్టింటికి వెళ్లాడు. వారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మరింత కోపోద్రిక్తుడైన సిద్దయ్య.. తన మామ సుబ్బారాయుడిని వేట కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా దాడి చేశాడు. అతనికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Digital India Corporation: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..