Andhra Pradesh: ఆఖరికి అంబులెన్స్‌లను కూడా వదలడం లేదు.. కేటుగాళ్ల నయా ప్లాన్ చూసి షాకైన పోలీసులు..

|

Oct 14, 2021 | 10:34 AM

Andhra Pradesh: మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మద్యం మాఫియా మాత్రం కంట్రోల్ అవడం లేదు. కేటుగాళ్లు ప్రతిసారి ప్లాన్ మార్చి మద్యం

Andhra Pradesh: ఆఖరికి అంబులెన్స్‌లను కూడా వదలడం లేదు.. కేటుగాళ్ల నయా ప్లాన్ చూసి షాకైన పోలీసులు..
Liquor
Follow us on

Andhra Pradesh: మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మద్యం మాఫియా మాత్రం కంట్రోల్ అవడం లేదు. కేటుగాళ్లు ప్రతిసారి ప్లాన్ మార్చి మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగించాల్సిన అంబులెన్సును సైతం వారి అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అక్రమ మధ్యం రవాణా కోసం అంబులెన్స్‌ని ఉపయోగించారు కొందరు మద్యం దళారులు. పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా మడకశిర మండలం దిన్నమీద పాళ్యం గ్రామ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అప్పటికే అంబులెన్స్‌లో అక్రమంగా కర్ణాటక మధ్యం రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకున్నారు పోలీసులు. ఆ సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులకు విస్తుపోయే రేతిలో మద్యం పట్టుబడింది.

అంబులెన్స్‌ను తనిఖీ చేయగా.. అందులో భారీగా మధ్యం పట్టుబడింది. 3,600 మధ్యం పాకెట్లు, 64 బాక్సుల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మద్యం విలువ సమారు రూ.5,10,000 ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అంబులెన్స్, ఒక కియా కారు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు. కాగా, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగించే అంబులెన్స్‌ను మద్యం అక్రమ రవాణాకు ఉపయోగించడం క్షమించరాని నేరం అన్నారు పెనుకొండ డీఎస్పీ రమ్య. అంబులెన్స్‌లో మద్యం తరలించడాన్ని గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులను డీఎస్పీ అభనిందించారు.

Also read:

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Digital India Corporation: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..