పవన్‌కు ఉన్నవి ఆ మూడు.. లేనివి ఆ మూడు..!

| Edited By:

Feb 09, 2020 | 10:03 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాస్ బద్దలు అయిపోయిందని వ్యాఖ్యానించిన అమర్‌నాథ్.. పవన్ సినిమాలైనా చేసుకోవాలి లేదా రాజకీయాలు అయినా చేసుకోవాలని సూచించారు. అంతేకానీ సినిమాలకు మధ్యలో రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పవన్‌కు ఉన్నవి మూడు, లేనివి కూడా మూడేనని తాను ఎప్పుడో చెప్పానని అమర్‌నాథ్ గుర్తుచేశారు. సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు పవన్‌కు లేవని […]

పవన్‌కు ఉన్నవి ఆ మూడు.. లేనివి ఆ మూడు..!
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాస్ బద్దలు అయిపోయిందని వ్యాఖ్యానించిన అమర్‌నాథ్.. పవన్ సినిమాలైనా చేసుకోవాలి లేదా రాజకీయాలు అయినా చేసుకోవాలని సూచించారు. అంతేకానీ సినిమాలకు మధ్యలో రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పవన్‌కు ఉన్నవి మూడు, లేనివి కూడా మూడేనని తాను ఎప్పుడో చెప్పానని అమర్‌నాథ్ గుర్తుచేశారు. సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు పవన్‌కు లేవని ఆయన చెప్పారు. ఇక ఆయనకు ఉన్న మూడు ఏంటో ప్రజలందరకీ తెలుసంటూ పరోక్షంగా పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు.