ఆ విషయం జగన్ మోహన్ రెడ్డి చెప్పాడని నిరూపించండి: బాబుకు సవాల్

| Edited By: Srinu

Dec 12, 2019 | 4:13 PM

జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించాడో మీరు నిరూపించండి అంటూ ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగిన నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన జగన్.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు 45 వేల ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులను మార్చే సువర్ణవకాశం మీ చేతుల్లో ఉండేదని, కానీ చేయలేకపోయారని విమర్శించారు. 45 వేల గవర్న్‌మెంట్ స్కూళ్లల్లో కేవలం 34శాతం […]

ఆ విషయం జగన్ మోహన్ రెడ్డి చెప్పాడని నిరూపించండి: బాబుకు సవాల్
Follow us on

జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించాడో మీరు నిరూపించండి అంటూ ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగిన నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన జగన్.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు 45 వేల ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులను మార్చే సువర్ణవకాశం మీ చేతుల్లో ఉండేదని, కానీ చేయలేకపోయారని విమర్శించారు. 45 వేల గవర్న్‌మెంట్ స్కూళ్లల్లో కేవలం 34శాతం మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్చారని.. మిగిలిన 66శాతం పాఠశాలలను వదిలేశారని, దీనికి సిగ్గుతో తలదించుకోండి అంటూ జగన్ సూటిగా విమర్శనాస్త్రాలు స్పందించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసం అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం చేయలేదని చంద్రబాబుపై జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులను మార్చలేని మీరు.. 40సంవత్సరాల రాజకీయానుభవం అని చెప్పుకుంటున్నందుకు సిగ్గుపడాలని జగన్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు తాను తలదించుకోవాల్సిన అవసరం లేదని, కానీ మీరు క్షమాపణ చెప్పాలని జగన్ అన్నారు. ఈ సందర్భంగా కళ్లు పెద్దవి చూస్తే ఇక్కడ ఎవ్వరూ భయపడరంటూ జగన్ మరోసారి తనలోని ఫైర్‌ను చూపించారు.