జగన్‌ విషయంలో చిరు సలహా.. అందుకే పవన్ సైలెంట్ అయ్యారా..!

| Edited By:

Oct 20, 2019 | 6:02 PM

ఈ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ప్రజల తరఫున తన గొంతును వినిపిస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీకి చెందిన శతఘ్నిటీమ్ ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే క్యాంపైయిన్‌నే నడిపింది. ఈ క్రమంలో అప్పట్లో ఆ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అవ్వడం.. దానిపై ఆ సంస్థను పవన్ ప్రశ్నించడం.. ఆ తరువాత ఆ ఖాతాలు మళ్లీ యాక్టివ్ అవ్వడం.. ఇలా వరుసగా […]

జగన్‌ విషయంలో చిరు సలహా.. అందుకే పవన్ సైలెంట్ అయ్యారా..!
Follow us on

ఈ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ప్రజల తరఫున తన గొంతును వినిపిస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీకి చెందిన శతఘ్నిటీమ్ ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే క్యాంపైయిన్‌నే నడిపింది. ఈ క్రమంలో అప్పట్లో ఆ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అవ్వడం.. దానిపై ఆ సంస్థను పవన్ ప్రశ్నించడం.. ఆ తరువాత ఆ ఖాతాలు మళ్లీ యాక్టివ్ అవ్వడం.. ఇలా వరుసగా జరిగాయి. ఇదిలా ఉంటే ఇటీవల జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలవగా.. అప్పటి నుంచి పవన్ కల్యాణ్‌‌లో ఏదో మార్పు వచ్చినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే జగన్ విషయంలో పవన్‌కు చిరంజీవి కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. జగన్ తన వైఖరితో ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ పెద్ద మొండి ఘటం అని చంద్రబాబు సహా పలువురు రాజకీయ నాయకులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక వైఎస్సార్‌తో కలిసి పనిచేయనప్పటికీ.. చిరంజీవికి వైఎస్ గురించి బాగా తెలుసు. ఇక ఇప్పుడు జగన్‌ పరిపాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం అంత వ్యతిరేకత లేదు. ఇవన్నీ అంచనా వేసిన చిరంజీవి.. జగన్ విషయంలో పవన్‌కు కాస్త తగ్గి ఉండమని సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టారు. ఆ మధ్య యురేనియం తవ్వకాలపై గళం విప్పిన జనసేనాని.. ఇప్పుడు ఆర్టీసీ యూనియన్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే.