అమరావతి ఆందోళనలు.. ఆగిన మరో రెండు గుండెలు

| Edited By: Pardhasaradhi Peri

Jan 15, 2020 | 12:25 PM

ఏపీలోని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున రాజధాని గ్రామాల్లో ఇద్దరు రైతులు తనువు చాలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన అంబటి శివయ్య(70), ఐనవోలు గ్రామానికి చెందిన కట్టపోగు వీరమ్మ(60) గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే వీరు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అమరావతి పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్న శివయ్య రోజూ దీక్షా శిబిరంలో కూర్చొనేవారు. రాజధాని […]

అమరావతి ఆందోళనలు.. ఆగిన మరో రెండు గుండెలు
Follow us on

ఏపీలోని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున రాజధాని గ్రామాల్లో ఇద్దరు రైతులు తనువు చాలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన అంబటి శివయ్య(70), ఐనవోలు గ్రామానికి చెందిన కట్టపోగు వీరమ్మ(60) గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే వీరు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే అమరావతి పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్న శివయ్య రోజూ దీక్షా శిబిరంలో కూర్చొనేవారు. రాజధాని కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమని గతంలో ఓ సందర్భంలో శివయ్య ప్రకటించారు. అంతేకాదు ఇటీవల పురుగుల మందు డబ్బాతో నిరసనలో పాల్గొని ఆత్మహత్యకు సైతం యత్నించారు. బుధవారం గుండెపోటుతో మరణించారు. కాగా మృతుల కుటుంబాలకు రాజధాని పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.