Breaking: జూలైలో పదో తరగతి పరీక్షలు.. ఏపీ మంత్రి క్లారిటీ..!

| Edited By:

May 11, 2020 | 6:35 PM

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. జూలై 1వ తేది నుంచి 15వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన సురేష్‌ వివరించారు. అలాగే పదో తరగతి పరీక్షల కోసం […]

Breaking: జూలైలో పదో తరగతి పరీక్షలు.. ఏపీ మంత్రి క్లారిటీ..!
Follow us on

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. జూలై 1వ తేది నుంచి 15వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన సురేష్‌ వివరించారు. అలాగే పదో తరగతి పరీక్షల కోసం సాధారణంగా 2,900 సెంటర్లు అవసరమవుతుంటాయని.. కానీ భౌతిక దూరం నేపథ్యంలో కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో క్లాస్ రూమ్‌లో 12 మంది విద్యార్థులతో పరీక్షలు రాయించనున్నామని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే మేనెలలో టెన్త్‌ పరీక్షలు ఉంటాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని.. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

Read This Story Also: జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య.. నలుగురు వచ్చి..!