జగన్ గారూ.. ఇంత అవమానం ఎలా భరిస్తున్నారండి..?: లోకేష్ సెటైర్లు

గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. ఆశా వర్కర్లు జగన్ గురించి మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేసిన లోకేష్.. ‘‘వైఎస్ జగన్ గారూ.. ఈ మహిళ మాటలు విన్నారా..? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి ఇంత అవమానం? నాకైతే తల కొట్టేసినట్లనిపించింది’’ అని ట్వీట్ చేశారు. .@ysjagan గారూ.. ఈ మహిళ మాటలు విన్నారా ? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి […]

జగన్ గారూ.. ఇంత అవమానం ఎలా భరిస్తున్నారండి..?: లోకేష్ సెటైర్లు

Updated on: Aug 28, 2019 | 8:44 AM

గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. ఆశా వర్కర్లు జగన్ గురించి మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేసిన లోకేష్.. ‘‘వైఎస్ జగన్ గారూ.. ఈ మహిళ మాటలు విన్నారా..? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి ఇంత అవమానం? నాకైతే తల కొట్టేసినట్లనిపించింది’’ అని ట్వీట్ చేశారు.

అంతటితో ఆగకుండా ‘‘నేను పనిచేసిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి పాలన సాగించినందుకు అంతర్జాతీయ స్థాయిలో మా ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి. నిండా 3 నెలల పాలనకే మీపై ఇంత ప్రజా వ్యతిరేకతా?’’ అని కామెంట్ పెట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us