ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తారా..?: టీడీపీ ఎమ్మెల్యేల ఫైర్

| Edited By:

Jul 23, 2019 | 11:49 AM

సభ నుంచి తమను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో దుర్దినమని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి ఫైర్ అయ్యారు. మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారని.. పెన్షన్‌పై ప్రశ్నిస్తే అకారణంగా సస్పెండ్ చేశారంటూ వారు మండిపడ్డారు. వాకౌట్ కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పను.. మడమ తిప్పనున్న సీఎం దీనికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా సీఎం కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలు […]

ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తారా..?: టీడీపీ ఎమ్మెల్యేల ఫైర్
Follow us on

సభ నుంచి తమను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో దుర్దినమని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి ఫైర్ అయ్యారు. మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారని.. పెన్షన్‌పై ప్రశ్నిస్తే అకారణంగా సస్పెండ్ చేశారంటూ వారు మండిపడ్డారు. వాకౌట్ కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పను.. మడమ తిప్పనున్న సీఎం దీనికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా సీఎం కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని టీడీపీ ఎమ్మెల్యేలు దుయ్యారబట్టారు. సస్పెండ్ చేసినా ప్రజల కోసం తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వారు అన్నారు. అయితే సభకు సహకరించడం లేదన్న కారణంతో ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుపై అసెంబ్లీలోకి రాకూడదంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాలు జారీ చేశారు.