సీఎం జగన్‌ ఫ్యామిలీకి షాక్.. తల్లి, సోదరికి కోర్టు నోటీసులు

| Edited By:

Jan 07, 2020 | 8:31 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి కోర్టు షాక్ ఇచ్చింది. జగన్ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, సోదరి షర్మిలకు కోర్టు నోటీసులు అందించింది. 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికి సమన్లు జారీ చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా కోర్టు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఈ నెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో వీరంతా హాజరు కావాల్సి ఉంది. అయితే 2012లో వీరందరూ రోడ్డుపై […]

సీఎం జగన్‌ ఫ్యామిలీకి షాక్.. తల్లి, సోదరికి కోర్టు నోటీసులు
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి కోర్టు షాక్ ఇచ్చింది. జగన్ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, సోదరి షర్మిలకు కోర్టు నోటీసులు అందించింది. 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికి సమన్లు జారీ చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా కోర్టు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఈ నెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో వీరంతా హాజరు కావాల్సి ఉంది.

అయితే 2012లో వీరందరూ రోడ్డుపై ఓ సభను నిర్వహించారు. దీనికి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పరకాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక ఈ కేసులో తాజాగా కోర్టు నలుగురికి నోటీసులు జారీ చేసింది. అయితే జగన్ కుటుంబసభ్యులకు ఇలా కోర్టు నోటీసులు అందడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీఎం జగన్ కూడా అదే రోజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంకు హాజరు అవ్వనున్న విషయం తెలిసిందే.